అన్నాడీఎంకేతో తెగతెంపుల..పీఎంకే ఒంటరిపోరు.

అన్నాడీఎంకేతో తెగతెంపుల..పీఎంకే ఒంటరిపోరు.

చెన్నై: తమిళనాడులోని తొమ్మిది జిల్లాల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేయనున్నట్టు పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే) బుధవారం ఇక్కడ ప్రకటించింది. కార్యకర్తలతో పీఎంకే వ్యవస్థాపక నేత ఎస్.రామదాస్, పార్టీ యువజన విభాగం చీఫ్ అన్బుమణి రామదాస్ మంగళవారం నిర్వహించిన వర్చువల్ మీటింగ్లో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 2019 పార్లమెంటరీ ఎన్నికల్లోనూ, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ అన్నాడీఎంకే పొత్తుతో పీఎంకే పోటీ చేసింది. తాజా పరిణామంపై అన్నాడీఎంకే ప్రతినిధి, మాజీ మంత్రి డి.జయకుమార్ మాట్లాడుతూ, ప్రజలు అన్నాడీఎంకే వైపే ఉన్నందున ఆ ప్రభావం తమపై ఉండదని అన్నారు. పీఎం కేకు మాత్రమే నష్టమని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆధికార డీఎంకేను తాము ఓడిస్తామని చెప్పారు. డీఎంకే ఇప్పటికే ఇచ్చిన వాగ్దానాల అమలులో విఫల మైందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నాడీఎంకే భారీ విజయం నమోదు చేస్తుందని జయకుమార్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో అక్టోబర్ 6,9 తేదీల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్నాయి.

తాజా సమాచారం