మేఘాల్లో తేలియాడించే తడియాండిమోల్‌..

  • In Tourism
  • November 12, 2019
  • 218 Views
మేఘాల్లో తేలియాడించే తడియాండిమోల్‌..

కర్ణాటక రాష్ట్రాన్ని పర్యాటకంగా అగ్రస్థానంలో నిలపడంలో దట్టమైన పశ్చిమ కనుమలు అందులో ఎత్తైన శిఖరాలు,అందమైన లోయలు,జలపాతాలదే ప్రధాన పాత్ర.కర్ణాటకలో ఎటు చూసినా పర్యాటక ప్రాంతాలతో అలరారే కూర్గ్ జిల్లాలోని కక్కాబె పట్టణానికి సమీపంలో ఉన్న తడియాండమోల్ శిఖరం చాలా ప్రత్యేకం.సరిగ్గా కేరళ – కర్నాటక సరిహద్దు ప్రాంతంలో సముద్రమట్టానికి 1,748 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ శిఖరం ట్రెక్కర్లకు, పర్వతారోహకులకు ఎంతో సవాలుగా ఉంటుంది.మలయాళం భాషలో తడియాండమాల్ అంటే తెలుగులో పెద్ద పర్వతం అని అర్థం.

మేఘాల్లో శిఖరం అంచులు..


ఈ శిఖరం ట్రెక్కింగ్ కాస్త కష్టంగానే అనిపించనప్పటికి శిఖరం పైకి ఎక్కి చూస్తే పడిన కష్టం అంతా పోయి ఎంతో ఆనందం కలుగుతుంది.ఎత్తైన కొండలు,రాళ్ల మధ్య ప్రవహించే నదీ ప్రవాహంలో రివర్ ర్యాఫ్టింగ్ కూడా ఆహ్లాదాన్ని పంచుతుంది.శిఖరం అంచు నుంచి చూసి అందాలతో పాటు ట్రెక్కింగ్ చేసే సమయంలో కనిపించే దృశ్యాలు,ప్రాంతాలు మరెంతో అనుభూతిని కలిగిస్తాయి.షోలా అడవులు చాలా ప్రాచీనమైనవి మరియు ఇంతవరకు ఎవరూ చొరబడనివిగా చెపుతారు.ఇక తడియాండిమోల్ పర్యటనలో తప్పకుండా చూడాల్సిన ప్రదేశాల గురించి పరిశీలిస్తే..

లోయ అందాలు..


షోలా అడవులు


పడి ఇగ్గుతప్ప ఆలయం :
కొడవల తెగకు చెందిన ప్రాచీన దేవాలయంగా పడి ఇగ్గుతప్ప దేవాలయం ప్రసిద్ధి చెందింది.ఆలయం లోని ప్రధాన దైవం లఘుతప్ప (సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారం).ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణ తులాభారం. ప్రతియేటా మార్చి లో కాలియార్చి పండగ వైభవంగా జరుగుతుంది.

పడి ఇగ్గుతప్ప ఆలయం


విరాజ్ పేట:
కాఫీ తదితర సుగంధ ద్రవ్యాలకు విరాజ్పేట రాజధాని అంటే అతిశయోక్తి కాదేమో.ఎటు చూసినా పచ్చటి కాఫీతోటలు ఇతర సుగంధ ద్రవ్యాల సువాసనలతో విరాజ్పేట ప్రతి ఒక్కరి మనసులను స్వర్గం అంచులకు తీసుకెళుతుంది.ఇక్కడి అయ్యప్ప దేవాలయాన్ని భక్తులు,స్థానికులు తప్పక పవిత్రమైనదిగా భావిస్తారు.దీంతో సంవత్సరం పొడవునా భక్తులు,పర్యాటకులు దేవాలయాన్ని సందర్శిస్తుంటారు.

కాఫీతోటలు


కాకోతుపరంబు
విరాజ్ పేట నుండి 8 కి. మీ ల దూరంలో ఉన్న కాకోతుపరంబు ప్రదేశంలో సెయింట్ ఆన్స్ చర్చి తడియాండమోల్ మరో ప్రధాన ఆకర్షణ.సుమారు రెండు శతాబ్దాల క్రితం ఫాదర్ గుల్లివాన్ అనే వ్యక్తి గోతిక్ నిర్మాణ శైలిలో ఈ చర్చిని కట్టించాడు. నగరం మధ్యలోని క్లాక్ టవర్ మరియు సమీపంలోని గణేశ దేవాలయం కూడా చూడదగినవే!

సెయింట్ ఆన్స్ చర్చి


నలకనాడు ప్యాలెస్ :
దట్టమైన పశ్చిమ కనుమల్లో వేటకు లేదా పర్యటనకు వెళ్లిన సమయంలో సురక్షితంగా ఉండడానికి వీలుగా రాజా దొడ్డరాజు వీరేంద్ర నలకపాడు ప్యాలెస్ నిర్మించినట్లు స్థానిక చరిత్ర.రెండు అంతస్థులతో మొత్తం 12 స్తంబాలతో నిర్మించిన ఈ ప్యాలెస్ నేటికీ చెక్కు చెదరకుండా ఉంటూ ఇప్పటికీ ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఆశ్రయం కల్పిస్తోంది..

నలకనాడు ప్యాలెస్


ఎలా చేరుకోవాలి ?
బెంగళూరు,మంగళూరు లేదా మైసూరు నగరాల నుంచి తడియాండమోల్కు ప్రభుత్వ,ప్రైవేటు బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.బస్సుల్లో నేరుగా తడియాండిమోల్ చేరుకొని ట్రెక్కింగ్ చేయడమే.రైలు మార్గం ద్వారా వెళ్లాలంటే బెంగళూరు లేదా మైసూరు నుంచి మంగళూరు చేరుకొని అక్కడి నుంచి ప్రభుత్వ,ప్రైవేటు బస్సుల్లో తడియాండిమోల్ చేరుకోవచ్చు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos