జనం రాక మైదానం మొత్తం ఖాళీ!

జనం రాక మైదానం మొత్తం ఖాళీ!

బేతిమా: సరికొత్త రాజకీయ వ్యవస్థను నెలకొల్పడమే లక్ష్యమంటూ 3,500 కి మీల జన సురాజ్ పేరిట సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కి తొలిరోజే షాక్ తగిలింది. యాత్ర మొదటిరోజైన ఆదివారం పశ్చిమ చంపారణ్ జిల్లా బేతియాలో బహిరంగ సభ జనం లేక వెలవెల బోయింది. 1917లో మహాత్మాగాంధీ మొదటి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించింది ఇక్కడే. పీకే పాదయాత్ర 12 నుంచి 18 నెలల పాటు కొనసాగనుంది. ఎలాంటి విరామం లేకుండా సాగనున్న యాత్రలో ప్రతీ పంచాయతీకి ఆయన వెళ్లనున్నారు. దాదాపు 3,500 కి.మీ ఆయన నడవనున్నారు. భారీ లక్ష్యాలు, అందుకు తగిన ఏర్పాట్లతో ఆదివారం పాదయాత్ర ప్రారంభించిన ప్రశాంత్ కిశోర్ బృందానికి తొలిరోజే నిరాశ ఎదురైంది. బహిరంగ సభ కోసం భారీ ఏర్పాట్లు చేసినా.. అనుకున్న స్థాయిలో జనం రాలేదు. మైదానం మొత్తం ఖాళీగా దర్శనమిచ్చింది. సభా ప్రాంగణంలో కనిపించినవారిలో కొందరు.. పీకే కోసం రాలేదని, అక్కడి గాంధీ ఆశ్రమ సందర్శన కోసం వచ్చినవారన్నది స్థానికుల మాట.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos