నిరాడంబరంగా పినరయి విజయన్ కుమార్తె వివాహం

నిరాడంబరంగా పినరయి విజయన్ కుమార్తె వివాహం

తిరువనంత పురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పెద్ద కుమార్తె టీ.వీణ, సీపీఐఎం యువజన విభాగం డీవైఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు, న్యాయవాది మహ్మద్ రియాజ్ వివాహం సోమవారం ఉదయం 10.30 గంటలకు ఇక్కడ నిరాడంబరంగా జరిగింది. లాక్ డౌన్ వల్ల అత్యంత సన్నిహితులే హాజరయ్యారు. వారిలో సీపీఎం రాష్ట్ర కార్యతదర్శి బాలకృష్ణన్, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రహీమ్ సహా మొత్తం 50 మంది అతిథులు పాల్గొన్నారు. పెళ్లి ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహమే. మొదటి వివా హంలో వీణకు ఒకరు, రియాజ్కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీణ 2014లో బెంగళూరులో ఎక్సోలాజిక్ సొల్యూషన్స్ అనే సంస్థ స్థాపక మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అబ్దుల్ ఖాదర్ కుమారుడు అయిన మహ్మద్ రియాజ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ)తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన 2009 లోక్సభ ఎన్నికల్లో కోజికోడ్ నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎమ్) అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్కే రాఘవన్ చేతిలో కొద్దిపాటి ఓట్ల తేడాతో ఓడారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos