ఆడ బాతుకు స్వయం వరం..

ఆడ బాతుకు స్వయం వరం..

తన ఇంట్లో పెంచుకుంటున్న ఓ ఆడ బాతుకు మగ బాతు కావాలంటూ బాతు యజమాని స్వయంవరం ప్రకటించాడు.ఈ మేరకు పోస్టర్లు సైతం అతికించి మగ బాతు కోసం వెతుకుతున్నాడు.అమెరికాలోని బ్లూ హిల్స్ ప్రాంతానికి చెందిన మారిస్చాలా కాలంగా బాతులు పెంచుకుంటున్నాడు.అయితే పెంచుకుంటున్న బాతుల్లో ఓ ఆడ బాతు తప్ప మిగతా బాతులన్నీ కొన్ని వారాల క్రితం మృతి చెందాయి. దీంతో మిగిలి పోయిన ఆడ బాతు బాధను చూడలేక మారిస్ పోస్లర్లు అతికిస్తూ మగ బాతు కోసం ప్రయత్నిస్తున్నాడు. బాతు బొమ్మ గీసి దానికి సరిపోయే మగబాతు కావాలని పేర్కొంటూ పోస్టర్లు అతికించాడు.అందులో తన ఈమెయిల్ అడ్రస్ రాశాడు.మగ బాతులను తీసుకొని ఆదివారం తన వద్దకు రావాలని తెలిపాడు. ప్రకటనపై పలువురు స్పించారు. ఇప్పటికే ఆయన ఇంటికి కొందరు తమ మగబాతును తీసుకొని వెళ్లారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos