ఉత్తర ప్రదేశ్లో మహిళలను బతకనివ్వరా?

ఉత్తర ప్రదేశ్లో మహిళలను బతకనివ్వరా?

లక్నో: ‘ఉత్తర ప్రదేశ్లో మహిళలను బతకనివ్వరా’ని కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ శనివారం ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ను ప్రశ్నించారు. ఉన్నావ్ బాధితురాలి కుటుంబాన్ని కలుసుకుని పరామర్శించారు. తర్వాత విలేఖరులతో మాట్లాడారు. ‘ ముఖ్యమంత్రి యోగి చెబుతున్న దానికి, రాష్ట్రంలో జరుగుతున్న దానికీ ఏమాత్రం పొంతన లేదు. ‘‘ఉత్తర ప్రదేశ్లో మహిళలను బతకనివ్వరా? రాష్ట్రంలో నేరగాళ్లకు స్థానం లేదని ముఖ్యమంత్రి పదే పదే చెబుతారు. ఆయన చెప్పిన దానికి భిన్నంగా జరుగుతోంది. ఇక్కడ మహిళలకు స్థానం లేదని నాకనిపిస్తోంద’ని వ్యాఖ్యానించారు. ‘బాధిత కుటుంబాన్ని గత ఏడాది నుంచి నిందితులు వేధిస్తూనే ఉన్నారు. వాళ్లకు భాజపాతో సంబంధాలు ఉన్నట్టు కూడా నా దృష్టికి వచ్చింది. నిందితులకు బీజేపీతో సంబంధాలు ఉన్నందునే వారిని కాపాడుతూ వస్తున్నారు. రాష్ట్రంలో నేరగాళ్లకు కనీసం భయం లేకుండా పోతోంద’ని మండిపడ్డారు. 23 ఏళ్ల బాధితురాలిపై నిందితులు కిరోసిన్ పోసి నిప్పంటించడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. కోర్టు విచారణకు హాజరయ్యేందుకు వెళ్తుండగా మార్గమధ్యంలో నిందితులు కాపుకాచి ఆమెపై దాడిచేశారు. 90 శాతం కాలిన గాయాలైన ఆమెను ఢిల్లీలోని సఫ్తర్గంజ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. 40 గంటల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె గుండెపోటుతో శుక్రవారం రాత్రి తనువు చాలించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos