.8 రాష్ట్రాల్లో సోదాలు.. పోలీసుల అదుపులో 90 మంది

.8 రాష్ట్రాల్లో సోదాలు.. పోలీసుల అదుపులో 90 మంది

న్యూ ఢిల్లీ : పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా-పీఎఫ్ఐపై ఎన్ఐఏ, ఈడీ మంగళవారం ఉదయం సంయుక్తంగా దాడులు జరిపాయి. ఎనిమిది రాష్ట్రాల్లో పలువురు కార్యకర్తలు, సంస్థల కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నాయి. ఐబీ, ఆయా రాష్ట్రాల పోలీసులు కూడా వారికి సహకరిస్తున్నారు. దేశవ్యాప్తంగా మొత్తం 90 మంది కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వారిలో 30 మందిని రాజధానిలో అరెస్ట్ చేశారు. దిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కర్ణాటకలో 40 మందికిపైగా అదుపులోకి తీసుకు న్నట్లు ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు. నిందితులపై సీఆర్పీసీ 107, 151 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.గుజరాత్లో సుమారు 10 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థతో వీరికి ఉన్న సంబంధాలపై ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. మహారాష్ట్ర నాసిక్ పోలీసులు. ప్రస్తుతం మాలేగావ్ పట్టణంలో దాడులు కొనసాగుతున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos