పెరరివళన్ కు పెరోల్‌‌

పెరరివళన్ కు పెరోల్‌‌

న్యూ ఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకుడు ఏజీ పెరరివళన్కు వైద్య పరీక్షల కోసం సుప్రీం కోర్టు సోమావారం వారం రోజులపాటు పెరోల్ జారీ చేసింది. నవంబర్12న అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని చూడటానికి, మేన కోడలు వివాహం హాజరుకావడానికి పెరోల్ పోందారు. ప్రస్తుతం పెరరివళన్ పుజల్ కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నారు. 1991లో చెన్నై సమీపంలోని శ్రీపెరంపుదూర్ వద్ద జరిగిన ఎన్నికల ర్యాలీలో ఎల్టీటీఈ ఆత్మాహుతి బాంబు దాడిలో రాజీవ్ గాంధీ హతుయ్యారు. నేరానికి పాల్పడిన పెరరివళన్, మురుగన్, అతని భార్య నళిని, సుతేంతిరా రాజా అలియాస్ సంతన్, రాబర్ట్ పయాస్, జయకుమార్, రవిచంద్రన్లకు జీవిత ఖైదు విధించారు. వీరిని విడుదల చేయాలనే తీర్మానాన్ని తమిళనాడు మంత్రి వర్గం ఆమోదించింది. ఆ దస్త్రం గవర్నర్ పరిశీలనలో ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos