ఇది పురాతన ముత్యం

ఇది పురాతన ముత్యం

అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని మురావా ద్వీపంలో జరిపిన తవ్వకాల్లో ప్రపంచంలోనే అతి పురాతనమైన-8,000 సంవత్సరాల కిందటి సహజమైన ముత్యం లభించినట్లు పురావస్తు శాఖ మంగళవారం ప్రకటించింది. రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా ఈ ముత్యం క్రీ.పూ5800-5600 నాటికి చెందినదిగా గుర్తించారు. ఆ కాలంలో వీటిని ఆభరణాలుగా వినియోగించేవారు. నవీన శిలా యుగంలోనూ ముత్యాల వ్యాపారం సాగింద నేందుకు, దేశ ఆర్థిక, సాంస్కృతిక చరిత్రకు చాలా లోతైన పునాదులు ఉన్నాయ నేందుకు ఇది నిదర్శనమని సాంస్కృతిక, పర్యాటకశాఖ ఛైర్మన్ మొహ్మద్ ఖలీఫా అల్ ముబారక్ విశ్లేషించారు. ఇక్కడ లౌవ్రే పురావస్తుశాలలో 10,000 ఏళ్ల లగ్జరీ పేరిట ఈ నెల 30 నుంచి పారంభం కాను న్న ప్రదర్శనలో ఈ ముత్యాన్ని చూడవచ్చు. మెసొపొటేమియా నాగరికతగా పేర్కొంటున్నఆ కాలంలో ఇరాక్ లో వీటి వాణిజ్యం సాగిందని  ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. మురావా తవ్వకాల్లో పింగాణీ వస్తువులతో పాటు రాళ్ల పూసల వంటి వస్తువులూ లభ్యమయ్యాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos