భౌతిక దూరం మేలు అంతంతే

భౌతిక దూరం మేలు అంతంతే

లండన్ : కరోనా వ్యాప్తి నివారణకు భౌతిక దూరం పాటించడం ఒక్కటే మార్గమని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.అయితే దీని వల్ల ప్రయోజనం లేదని తేలింది. ఆరు అడుగుల దూరంతో కరోనా సోకకుండా అడ్డుకోలేమని నికోసియా యూనివర్శిటీ పరిశోధకులు తేల్చి చెప్పారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తి, చిన్నగా దగ్గినా.. అత్యంత తక్కువ స్థాయిలో అంటే గంటకు 4 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తున్నప్పటికీ నోటి నుండి వెలువడే తుంపర్ల ద్వారా వైరస్ ఐదు సెకన్లలోనే 18 అడుగులు ప్రయాణిస్తుందని తెలిపారు. దీంతో పొట్టిగా ఉండే పెద్దలు, చిన్నారులకు ముప్పు ఉంటుందన్నారు. భౌతిక దూరాన్ని పాటించినా కరోనా ముప్పు తప్పదని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos