రీమేక్‌తో పవన్‌ రీ ఎంట్రీ!

  • In Film
  • October 22, 2019
  • 111 Views
రీమేక్‌తో పవన్‌ రీ ఎంట్రీ!

రాజకీయాల కోసం సినిమాల నుంచి తప్పుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్ది కాలంగా మళ్లీ సినిమాల వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్న తరుణంలో దిల్ రాజు బ్యానర్లో పవన్ నటించనున్నట్లు చిత్ర పరిశ్రమలో వార్తలు వినిపిస్తున్నాయి.2016లో హిందీలో ఘన విజయం సాధించిన పింక్ చిత్రం తెలుగు రీమేక్‌లో పవన్ నటించనున్నట్లు సమాచారం.పింక్ తెలుగు రీమేక్ హక్కులు దక్కించుకున్న దిల్ రాజు ‘కేవలం 25 రోజులు .. అదీ ఎప్పుడు వీలైతే అప్పుడు కేటాయిస్తే చాలు’ అని పవన్‌కు దర్శకుడు త్రివిక్రమ్ ద్వారా కబురు పంపినట్టుగా సమాచారం. చాలా తక్కువ రోజులే గనుక, పవన్ ఈ ప్రాజెక్టు పట్ల మొగ్గు చూపుతున్నాడని అంటున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos