2024 ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నాం

2024 ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నాం

రాజమండ్రి : 2024 ఎన్నికల్లో జనసేన, టీడీపీ రెండూ కలిసి పోటీ చేస్తాయని జనసేనాని పవన్ చెప్పారు. చెరసాల్లో బంధీగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు ను కలుసుకున్న తర్వాత ఆయన మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడారు. తనతో బీజేపీ కూడా కలిసి వస్తుందని భావిస్తున్నానన్నారు. ఇప్పటి వరకు పొత్తుల గురించి ఆలోచన మాత్రమే చేశానని, ఇప్పుడే పొత్తుపై స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నానని తెలిపారు. విడివిడిగా పోటీ చేస్తే వైసీపీ అరాచకాలను అడ్డుకోలేమని అన్నారు. జగన్ కు ఇక మిగిలింది కేవలం 6 నెలలు మాత్రమేనని చెప్పారు. ఈ నిర్ణయం ఈ రెండు పార్టీల మేలు కోసం తీసుకున్నదని కాదని, రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకున్నదని చెప్పారు.బిల్ క్లింటన్, బిల్ గేట్స్ వంటి వారిని రాష్ట్రానికి తీసుకొచ్చిన వ్యక్తి, ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి, సైబరాబాద్ వంటి సిటీని నిర్మించిన వ్యక్తి ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండటం అందరూ చాలా సిగ్గు పడాల్సిన విషయమని అన్నారు. పోలీసులపై తనకు ఎంతో గౌరవం ఉందని… కానీ పోలీసు అధికారులు వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని మండిపడ్డారు. జగన్ ను నమ్ముకున్న వైసీపీ నేతలందరికీ ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నానని… చేసిన తప్పులను సరిదిద్దుకోవాలని సూచించారు. 6 నెలల తర్వాత టీడీపీ, జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పు చేసిన ఏ ఒక్కరినీ ఉపేక్షించబోమని హెచ్చరించారు. మీరు యుద్ధమే కోరుకుంటే..యుద్ధానికి తాము సిద్ధమని చెప్పారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos