భారతీయ క్యాబ్ డ్రైవర్‌కు విందు ఇచ్చిన పాక్ క్రికెటర్లు..

  • In Sports
  • November 26, 2019
  • 58 Views
భారతీయ క్యాబ్ డ్రైవర్‌కు విందు ఇచ్చిన పాక్ క్రికెటర్లు..

రెండు టెస్టులు,మూడు టీ20 సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు ఓ భారతీయ క్యాబ్‌ డ్రైవర్‌కు విందు ఇచ్చింది. మొదటి టెస్టు కోసం బ్రిస్బేన్ వెళ్లిన పాకిస్థాన్‌ జట్టులోని ఐదుమంది సభ్యులు  ఇండియన్ రెస్టారెంట్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.ఈ క్రమంలో క్యాబ్‌ ఎక్కగా భారతీయుడైన క్యాబ్‌ డ్రైవర్‌ వారిని రెస్టారెంట్‌కు తీసుకెళ్లాడు.అయితే రెస్టారెంట్‌కు చేరుకున్న అనంతరం డ్రైవర్ క్రికెటర్లపై గౌరవంతో డబ్బులు తీసుకోలేదు.దీందో ఆశ్చర్యానికి గురైన క్రికెటర్లు క్యాబ్ డ్రైవర్ ను తమతో పాటు రెస్టారెంట్ కు తీసుకెళ్లి విందు ఇచ్చారు. విషయాన్ని డ్రైవర్ రేడియో వ్యాఖ్యాతకు తెలియజేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos