భారత్‌లో సర్పంచ్‌గా ఎన్నికైన పాక్‌ అమ్మాయి..

భారత్‌లో సర్పంచ్‌గా ఎన్నికైన పాక్‌ అమ్మాయి..

పాకిస్థాన్‌ నుంచి శరణార్థులకు భారత పౌరసత్వం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్న సమయంలో పాకిస్థాన్‌లో పుట్టిపెరిగిన ఓ అమ్మాయి భారత్‌లో ఓ గ్రామానికి సర్పంచ్‌గా ఎన్నిక కావడం చర్చనీయాంశమైంది.పాకిస్థాన్‌లోని సింధ్‌ ప్రాంతంలో పుట్టిన నీతా కన్వార్‌ అనే అమ్మాయి సుమారు 18 ఏళ్ల క్రితం రాజస్ధాన్‌ రాష్ట్రంలోని టోంక్‌ ప్రాంతంలో నివసిస్తున్న తల్లి,సోదరి వద్దకు వచ్చింది.అప్పటి నుంచి భారత పౌరసత్వం కోసం పోరాడుతున్న నీతాకు గత ఏడాది సెప్టెంబర్‌లో ఓటు హక్కు లభించింది.దీంతో టోంక్‌ జిల్లా నట్వారా గ్రామ పంచాయితీకి జరిగిన ఎన్నికల బరిలో అభ్యర్థిగా నిల్చున్న నీతా తన ప్రత్యర్థి సోనాదేవిపై 400 ఓట్ల పైచిలుకు మెజార్టీతో విజయం సాధించి సర్పంచ్‌గా ఎన్నికైంది.ఆసక్తికరమైన విషయం ఏమంటే  నీతా తండ్రి.. సోదరుడు ఇప్పటికి పాకిస్తాన్‌లోనే ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచ్ గా విజయం సాధించిన సంగతి తెలిసిన వారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారట. ఇంతకీ నీతా భారత్ ఎందుకు వచ్చిందన్నది చూస్తే.. సింధ్‌లో ఇంటర్ వరకూ చదివిన నీతా ఉన్నత విద్య కోసం భారత్‌కు వచ్చి భారత్‌కు చెందిన వ్యక్తిని వివాహం చేసుకొని ఇక్కడే స్థిరపడింది.ఈ క్రమంలో భారత పౌరసత్వం కోసం ప్రయత్నిస్తుండగా ఎట్టకేలకు నాలుగు నెలల క్రితమే ఆమె భారతీయురాలిగా పౌరసత్వం లభించింది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos