పాక్ కెప్టెన్‌పై వేటు

  • In Sports
  • October 18, 2019
  • 43 Views
పాక్ కెప్టెన్‌పై వేటు

ఇస్లామాబాద్ : పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌పై పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) వేటు వేసింది. తాజాగా శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో పాకిస్తాన్ జట్టు ఘోర ఓటమిని చవిచూసింది. దీంతో టెస్ట్ ఫార్మాట్, టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి సర్ఫరాజ్ అహ్మద్‌ను పీసీబీ తప్పించింది. ఆస్ట్రేలియాతో నవంబర్‌లో జరగబోయే రెండు టెస్ట్ మ్యాచులకు బ్యాట్స్‌మన్‌ అజర్ అలీని కెప్టెన్‌గా ప్రకటించింది. మూడు టీ20 మ్యాచులకు బాబర్ అజమ్‌ను సారథిగా ఎంపిక చేసింది. సర్ఫరాజ్ 2017 నుంచి మూడు ఫార్మాట్లకు సారథ్యం వహిస్తున్నాడు. 2017 ఐసీసీ చాంపియన్స్ టైటిల్ గెలుపులో కూడా కీలక పాత్ర పోషించాడు. కొన్నాళ్లుగా అతని కెప్టెన్సీలో పాక్ చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేదు.

తాజా సమాచారం