తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

 • అంచెట్టిలో మంచి దొంగలు

  హోసూరు : దొంగల్లో కూడా మంచి దొంగలు కూడా ఉంటారనే చెప్పుకోవాలి. టాస్మాక్ దుకాణంలో దొంగిలించిన మద్యం బాటిళ్లను గుట్టు చప్పుడు కాక వారం రోజుల తరువాత తిరిగి దుకాణం ముందు ఉంచి వెళ్లిన సంఘటన దీనికి నిదర్శనం. వివరాల్లోకి వెళితే… కృష్ణగిరి జిల్లా అంచెట్టిలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో వారం రోజుల కిందట రూ.లక్షకు పైగా విలువ చేసే 16 బాక్సుల్లో ఉన్న మద్యం బాటిళ్లను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఈ సంఘటనపై

  READ MORE
 • కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంది?

  హైదరాబాదు: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందో బహిర్గతం చేసేందుకు చర్యల్ని తీసుకోవాలని కోరతూ నవీన్ (తీన్మార్ మల్లన్న) శుక్రవారంఇక్కడి ఉన్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేసారు. ‘గత కొంత కాలంగా కేసీఆర్ కనిపించడం లేదు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి రకరకాల వార్తలు వస్తున్నాయి. నిజాలు తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నార’నివ్యాజ్యంలో పేర్కొన్నారు. విచారణ చేసిన న్యాయస్థనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాజకీయ గిమ్మిక్కులు చేయవద్దని హెచ్చరించింది. ఈ వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారించలేమని తెలిపింది.

  READ MORE
 • సచివాలయం భవనాల కూల్చివేతకు హైకోర్టు బ్రేక్‌

  హైదరాబాదు : సచివాలయం కూల్చి వేత పనుల్ని వచ్చే సోమవారం వరకూ నిలిపేయాలని ఉన్నత న్యాయస్థానం శుక్రవారం ఉత్తర్వుల్ని జారీ చేసింది. ఆచార్య పి.ఎల్.విశ్వేశ్వరరావు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించి ఈ మేరకు ఆదేశాల్ని ఇచ్చింది. ‘ కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ కూల్చివేత పనులను కొన సాగిస్తున్నారు. భవనాల కూల్చివేతతో వాతా వరణం కాలుష్య మవుతోంది. మున్సిపల్, ఘనవ్యర్థ పదార్థాల నిర్వహణ నిబంధనల గురించి పట్టించు కోవడం లేద’ని వ్యాజ్యంలో తప్పు బట్టారు.

  READ MORE
 • కరోనా పీడిత ప్రాంతంగా తిరుమల

  తిరుమల : కరోనా కేసులు పెరుగుతున్నందున తిరుమలను వ్యాధి పీడిత ప్రాంతంగా ప్రకటించారు.అయినా ఆలయం తెరిచే ఉంటుందని వివరించారు. లాక్డౌన్ తర్వాత ఆలయాన్ని తెరిచి నేటికి సరిగ్గా నెల. మొదట్లో రోజుకు కేవలం 6,000 మంది భక్తుల ప్రవేశానికే ఆలయ పాలక మండలి అనుమతించింది. ఇప్పుడు ఆ సంఖ్యను 12,000 మందికి పెంచింది.

  READ MORE
 • ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోమటిరెడ్డి లక్ష్మి నామినేషన్

  నల్గొండ : మహిళలకు సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లో అడుగిడుతున్నానని స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి లక్ష్మి తెలిపారు. పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు వెంటరాగా సోమవారం ఆమె నామినేషన్‌ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ సీనియర్‌ నాయకుల సూచన మేరకు ఎన్నికల బరిలోకి దిగుతున్నానని తెలిపారు. మంచి మెజారిటీతో విజయం సాధిస్తానని దీమా వ్యక్తం చేశారు. ప్రజల అభిమానం తమ కుటుంబానికి ఉందని, కోమటిరెడ్డి బ్రదర్స్‌ అంటే

  READ MORE
 • నాథూరామ్‌ గాడ్సే నిజమైన ఉగ్రవాది

  న్యూఢిల్లీ : జాతిపితను హతమార్చిన నాథూరామ్‌ గాడ్సే నిజమైన ఉగ్రవాది అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యానించారు. మంగళ వారం ఇక్కడ ఆయన విలేఖరులతో మట్లాడారు. ‘మహాత్మా గాంధీ హంతకుణ్ని గొప్పవాడిగా ఎలా అభివర్ణిస్తారని ప్రశ్నించారు. హిందూ ఉగ్ర వాదం గురించి నోరెత్తని వారు మహాత్మా గాంధీని చంపింది ఎవరో చెప్పాలని డిమాండ్‌ చేశారు. నాధూరామ్‌ గాడ్సేయే తొలి హిందు ఉగ్రవాది అని తమిళ నాడు అరవక్కురిచ్చిలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో మక్కళ్‌

  READ MORE
 • చిన జియ్యరు ఏలుబడిలో తెలంగాణ

  హైదరాబాద్: ఆధ్యాత్మిక బోధకులు రామానుజచిన జీయర్ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని ఆచార్య కంచె ఐలయ్య వ్యాఖ్యానించారు. మంగళ వారం ఇక్కడ సీపీఎం ఆధ్వర్యంలో జరిగిన ‘అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించి, దోషులను శిక్షించండి’ సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘ఈ రాష్ట్రాన్ని చిన జీయర్ పరి పాలిస్తున్నారు. దళితులు, వెనుక బడిన వర్గాల పక్షపాతి అని ప్రచారాన్ని చేసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంత వరకు ఏ అంబేద్కర్ విగ్రహానికి నివాళు లర్పించలేదు. అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చిన చోటే తిరిగి ప్రతిష్టించాలి.

  READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు