అన్నవరం కొండపై అన్యమత భజనలు..

అన్నవరం కొండపై అన్యమత భజనలు..

హిందువులు పరమ పవిత్రంగా భావించే అన్నవరం ఆలయ ప్రాంగణంలో అన్యమత ప్రచారాలు,ప్రార్థనలు ఉద్రిక్తతలకు దారి తీశాయి.కార్తీక మాసం,కార్తీక పౌర్ణమి నేపథ్యంలో దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులు సేదదీరేందుకు భజనల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా ఇరుపాక గ్రామానికి చెందిన అనిమిరెడ్డి నగేశ్ నటరాజ బాల భక్త సంఘం హాజరైంది.తమ ప్రదర్శనలో భాగంగా ఏసుక్రీస్తును కీర్తిస్తూ వీరు పాటలు పాడారు.దీనిపై భక్తులు తీవ్రంగా కలత చెంది దేవస్థానం రిసెప్షన్, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే ఆలయ చైర్మన్ నుంచి అధికారుల వరకూ పరుగులు పెడుతూ కళావేదిక వద్దకు వచ్చి, కార్యక్రమాన్ని నిలిపివేయించారు.భజన బృందంపై పోలీసులకు ఫిర్యాదు చేసి వారిని పోలీసులకు అప్పగించారు.ఈ సందర్భంగా భజన బృందంలోని సభ్యులు ఆలయ సూపరింటెండెంట్‌పై ఎదురు తిరగడంతో కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos