నీరందక ఎండుతున్న వరి పంట

హొసూరు : ఇక్కడికి సమీపంలోని కెలవరపల్లి డ్యాం కాలువ నీటితో సాగుచేస్తున్న వరి పంటకు సక్రమంగా నీరందక ఎండిపోతున్నదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెలవరపల్లి డ్యాం ఆయకట్టులో సుమారు ఎనిమిది వేల ఎకరాలలో రైతులు వరి పంటను సాగుచేస్తున్నారు. రెండు నెలల కిందట డ్యాం రెండు కాలువలలో నీటిని విడుదల చేశారు. 20 రోజుల కిందట హొసూరు సమీపంలోని భూధినాథం గ్రామం కదిరేపల్లి వద్ద డ్యాం కాలువ తెగిపోయింది. దీంతో నల్లగాన కొత్తపల్లి, అడ్డగురికి, కామనదొడ్డి పరిసర గ్రామాల రైతుల వరి పంటకు నీరందక పంట ఎండిపోయే స్థితికి

చేరుకుంది. కంకి దశలో  సక్రమంగా నీరు అందడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువలలో చెత్తా చెదారం పేరుకుపోవడంతో నీరు పొలాలకు చేరడానికి మరింత ఆలస్యం కావచ్చని, కనుక అధికారులు దీనిపై వెంటనే చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos