గెలుపు మాదే

గెలుపు మాదే

లఖ్నవ్: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గెలిచి తీరుతామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ దీమా వ్యక్తం చేసారు. మంగళ వారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘మేం ఎన్నికల్లో పోటీ చేస్తాం, గెలుస్తాం. ఉత్తర్ప్రదేశ్ ముస్లింలు గెలుస్తారు. యూపీలో భాజపాను ఓడించడమే మా లక్ష్యం’అన్నారు. ఎంఐఎం యూపీ అధ్యక్షుడు షౌకత్ అలీ కూడా మాట్లాడారు. తమకు ప్రజల్లో మద్దతు పెరుగుతోందని విపక్షాలు ఆందోళనకు గురవుతున్నాయి . కాన్ఫరెన్స్కు ముస్లింలు, దళితులు, బీసీలతో పాటు అగ్రవర్ణ హిందువులను ఆహ్వానించాం. భాజపా హయాంలో ముస్లింలతో పాటు వీరంతా వేధింపులకు గురయ్యారు. ముస్లింల హక్కుల కోసం మాత్రమే ఎంఐఎం పార్టీ పోరాడటం లేదు. భాజపా పాలనలో అన్ని వర్గాలు వేధింపులకు గురయ్యాయి. భాజపా, ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీ ల ప్రత్యామ్నాయం కోసం వీరంతా ఎదురుచూస్తున్నారు. ఈ పార్టీలన్నీ ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడుకున్నాయి. యూపీ ఎన్నికల్లో గెలిస్తే అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తాం’అన్నారు. సుమారు వంద అసెంబ్లీ నియోజక వర్గాల అభ్యర్థులను ఎంఐఎం పార్టీ ప్రకటించింది. భాగీదారీ సంకల్ప్ మోర్చ పేరుతో అనేక చిన్నపార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేసింది. ఇందులో ఓం ప్రకాశ్ రాజ్భర్ నేతృత్వంలోని సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, బాబు సింగ్ కుష్వాహాకు చెందిన జన్ అధికార్ పార్టీ, రాష్ట్రీయ ఉదయ్ పార్టీ, రాష్ట్రీయ ఉపేక్షిత్ సమాజ్ పార్టీ, జనతా క్రాంతి పార్టీలు ఉన్నాయి. అయోధ్యకు 57 కి.మీ దూరంలోని రుదౌలీ తెహసీల్లో ఒవైసీ ఎన్నికల ప్రచార సభ –వంచిత్ శోషిత్ సమాజ్ (అణగారిన వర్గాలు) సమావేశంలో ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం పోస్టర్లలో అయోధ్య జిల్లాను ఫైజాబాద్గా పేర్కొనడం పై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ ర్యాలీపై నిషేధించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఫైజాబాద్ జిల్లా పేరును 2018లోనే అయోధ్యగా మార్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos