ఆన్‌లైన్‌లో ఖైదీ టీచర్ పాఠాలు

ఆన్‌లైన్‌లో ఖైదీ టీచర్ పాఠాలు

సిమ్లా: ఇక్కడి చెరసాల్లో జీవిత శిక్ష అనుభవిస్తున్న ఒక ఖైదీ 10 నుంచి 12 తరగతులు విద్యార్థులకు ఆన్లైన్లో సైన్సు తరగతులు నిర్వహించి ఏడాదికి రూ.8 లక్షల ఆదాయాన్ని గడిస్తున్నారు. చెరసాల అధికార్లూ ఆ ఖైదీకి మద్దతి స్తున్నారు. బందీగా ఉన్న ఈ ఖైదీ ఉన్నత విద్యను అభ్యసించాడు. 2010లో తన ప్రియురాలితో పాటు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఆమె మృతి చెందింది. ఇతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. హత్యా నేరంపై అప్పటి నుంచి జైలులో జీవితకాల శిక్ష అనుభవిస్తున్నాడు. అతని ప్రతిభ గ్రహించిన జైలు అధికారులు అతనికి జైలులో సాంకేతిక పనులు చేసే పనిని అప్పజెప్పారు. జైలు అధికారుల అనుమతి మేరకు గత ఏడాది విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహించడం ప్రారంభించాడు. ఇతని బోధనా విధానం నచ్చడంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఈ ఖైదీకి పెద్ద కంపెనీ నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించే ఉపాధ్యాయునిగా అవకాశం వచ్చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos