డబ్బులొద్దు..ఉల్లిపాయలే ముద్దు

డబ్బులొద్దు..ఉల్లిపాయలే ముద్దు

కోల్కతా: దేశంలో ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకాయి. దీంతో దొంగలకు ఇవే ముద్దయ్యాయి. పశ్చిమ బంగ తూర్పు మిడ్నాపూర్ జిల్లాలో సుతహత ప్రాంతంలో అక్షయ్ దాస్కు చెందిన కూర గాయల దుకాణం సోమవారం రాత్రి ఉల్లి పాయ, వెల్లుల్లి, అల్లం బస్తాలు మాత్రమే మాయమయ్యాయి. మంగళవారం అంగడి తెరచినపుడు వస్తువులు చిందర వందరగా కనిపించాయి. చోరీ జరిగినట్లు గ్రహించి గల్లా పెట్టె చూడగా దానిలోని నగదు చెక్కు చెదరకుండా ఉంది. చోరీ అయిన ఉల్లి గడ్డల విలువ రూ.50 వేలు వరకు ఉంటుంది.

తాజా సమాచారం