పడిపోతున్న ఉల్లి ధరలు

పడిపోతున్న ఉల్లి ధరలు

కర్నూలు:నిన్నమొన్నటి వరకు రైతన్నలను కాస్త ఆదుకున్న ఉల్లి నేడు కన్నీరు పెట్టిస్తోంది. అన్ని వ్యవసాయ ఉత్పత్తుల బాటలోనే రోజురోజుకూ ఉల్లి ధర పతనం అవుతోంది. అమాంతం పడిపోయిన ఉల్లి రేట్లతో భారీగా నష్టపోతున్నామని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్​లో గత కొంతకాలంగా మిర్చి, కంది, వాము, వేరుశెనగ తదితర పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉల్లి పంటకు మొన్నటి వరకు స్థిరంగా గిట్టుబాటు ధర లభించింది. ఇదే ధరలు కొనసాగుతాయని ఆశించిన రైతుకు తీవ్ర నిరాశే ఎదురైంది. గత వారం రోజుల నుంచి ధరల పతనం ప్రారంభమైంది. ప్రస్తుతం సగానికి పైగా ధరలు పడిపోవటంతో రైతన్నలు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కర్నూలు మార్కెట్​కు రోజూ 700 నుంచి 1000 క్వింటాళ్ల ఉల్లి దిగుబడులు వస్తున్నాయి. క్వింటా ధర అత్యధికంగా 14 వందలు, కనిష్ఠ ధర రూ. 300 నుంచి రూ. 500 వరకు పలుకుతోంది. దీంతో కనీసం పెట్టుబడులు సైతం రావటం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos