ఓలికి ఊరట

ఓలికి ఊరట

ఖాఠ్మండు: ప్రధాని కె.పి.శర్మ ఓలి రాజ్యాధికార భవిష్యత్తును నిర్ణయించాల్సిన నేపాల్ కమ్యూనిస్టు పార్టీ స్థాయి సమితి సమావేశం వరుసగా ఐదో సారి వాయిదా పడింది. ‘దేశంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమాయత్తమైన పార్టీ సహాయక చర్యల్లో నిమ గ్నమైంది. అందువల్ల స్థాయి సమితి సమావేశాన్ని వారం పాటు వాయిదా వేసామ’ని ఎన్సీపీ అధికార ప్రతినిధి నారాయణ్ కాజీ శ్రేష్ఠ తెలిపారు. 45 మంది సభ్యుల నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ స్థాయి సమితి భేటీ శుక్రవారం జరగాల్సి ఉంది. నేపాల్ ప్రధాని ఓలి నాసిరకపు పని తీరుపైనా పార్టీలో అసమ్మతి పెరిగి పోతోంది. దీంతో ఆయన పదవి చ్యుతికి స్థాయి సమితి సమావేశాన్నినిర్వహించాలని పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అధికారాన్ని పంచుకునే విషయంలో ఓలికి, ఎన్సీపీ అధ్యక్షుడు పుష్ప కమల్ దహల్ ప్రచండకు మధ్య వివాదం కొనసాగుతోంది. దీనితో వారిద్దరి మధ్య రాజీ కుదర్చడానికి చైనా తెరవెనుక పావులు కదు పుతున్నట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos