ఒడిశా ప్రభుత్వం పెద్ద మనసు..

ఒడిశా ప్రభుత్వం పెద్ద మనసు..

లాక్ డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమై వ్యాపారం లేక ఉపాధి కోల్పోయిన వీధి వ్యాపారుల పట్ల ఒడిశా ప్రభుత్వం పెద్ద మనసు చాటుకుంది. ఒక్కో కుటుంబానికి రూ.3 వేల ఆర్థిక సాయం ప్రకటించింది. తక్షణం మొత్తాన్ని రాష్ట్రంలోని 114 పట్టణాలు, నగరాల్లో ఉన్న వారికి అందజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆదేశాలు జారీచేశారు.ప్రభుత్వ నిర్ణయంతో మొత్తం 65 వేల మంది కార్మికులు ప్రయోజనం పొందనున్నారు. అలాగే ఒడిశాలోని వలస కార్మికులకు సమీపంలోని పాఠశాలలు, హాస్టల్ భవనాల్లో వసతి సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి ఆయా జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉన్న బీహార్, పశ్చిమబెంగాల్, చత్తీస్ గఢ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను అధికారులు సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించారు.

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos