హీరోయిన్‌పై చీటింగ్‌ కేసు..

హీరోయిన్‌పై చీటింగ్‌ కేసు..

ఫేస్బుక్లో పరిచయమైన ఒడియా నటి తనను మోసగించిందని ఆరోపిస్తూ విశాఖకు చెందిన యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. ఒడియా నటి చిన్మయ ప్రియదర్శినితో విశాఖకు చెందిన పద్మరాజు రవికుమార్ అనే యువకుడికి ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. పరిచయం స్నేహంగా మారడంతో.. కొన్నాళ్లకు ప్రియదర్శిని పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చినట్టు రవికుమార్ వెల్లడించాడు. ఇదే క్రమంలో తన వద్ద నుంచి రూ.2లక్షలు నగదు, ఒక ల్యాప్టాప్, బంగారు గొలుసు తీసుకుందన్నాడు. ఆపై పెళ్లి గురించి మాట్లాడకపోవడంతో మోసపోయానని అర్ధమై పోలీసులను ఆశ్రయించినట్టు చెప్పాడు. అయితే తాజాగా విశాఖ యువకుడి ఆరోపణలపై సదురు హీరోయిన్ స్పందించింది. భువనేశ్వర్ లో మీడియాతో మాట్లాడింది. తాను ఎవరినీ మోసం చేయలేదని స్పష్టం చేసింది. రవికుమారే తనతో ఫేస్ బుక్ లో పరిచయం పెంచుకొని అభిమానిని అంటూ తనను కలిసి డబ్బులు ఆర్థిక ఇబ్బంది ఉందని లక్షన్నర తీసుకున్నాడని తెలిపింది. 50వేలు మాత్రమే తిరిగి ఇచ్చాడని.. పెళ్లి చేసుకుంటానని ప్రస్తావన తెస్తే నో చెప్పినందుకే ఇలా కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నాడని ఆమె పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos