క్రెడిట్ కార్డుదార్లకు లభించని ఊరట

  • In Money
  • March 27, 2020
  • 114 Views
క్రెడిట్ కార్డుదార్లకు లభించని ఊరట

ఢిల్లీ : కరోనా ప్రభావంతో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఆర్‌బీఐ కీలక ప్రకటన రుణ గ్రహీతలకు భారీ ఊరటనిచ్చింది. వచ్చే 3నెలలు అన్ని లోన్ల ఈఎంఐలపై మారటోరియం విధించింది. దీంతో గృహ రుణాలు సహా అన్నిరకాల రుణాలపై మూడు నెలలు ఈఎంఐలు కట్టకుండా వెసులుబాటు కల్పించినట్లు అయింది. దేశంలోని అన్ని బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలకు ఇది వర్తిస్తుందని గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలిపారు. అలాగే మూలధన సహకార సహా, అన్ని రకాల రుణాలపై కూడా 3 నెలలు విధించిన తాజా మారటోరియంతో ఇప్పుడు కట్టాల్సిన రుణాలను గడువు తర్వాత ఎప్పుడైనా చెల్లించవచ్చు. ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించే క్రమంలో భాగంగా ప్రధానంగా నాలుగు చర్యలు తీసుకున్నట్టు శక్తికాంత దాస్ తెలిపారు. బ్యాంకులు, రుణాలు జారీ చేసే సంస్థలకు సంబంధిత మార్గదర్శకాలను ఆర్‌బీఐ జారీచేసింది. సమీకరణ కోసం ఇబ్బందులు పడుతున్న బ్యాంకులను ఎన్‌పీఏలుగా ప్రకటించమని ఆయన చెప్పారు. కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 1.7 లక్షల కోట్ల రూపాయల రిలీఫ్ ప్యాకేజీ ప్రకటించిన మరుసటి రోజే (శుక్రవారం) కేంద్రం బ్యాంకు ఆర్‌బీఐ కీలక నిర్ణయాలను ప్రకటించింది. కీలక వడ్డీ రేట్లపై ముందస్తు కోతను విధించడంతోపాటు లాక్‌డౌన్ కష్టాల నుంచి బయటపడేందుకు రుణాలపై భారీ ఊరటనిచ్చింది. అన్ని రకాల రుణాలపై మూడు నెలల పాటు మారటోరియం విధించింది. దీని ప్రకారం గృహ, ఇతర రుణాలను తీసుకున్న వినియోగదారులకు ఈఎంఐ చెల్లింపుల నుంచి మూడు నెలల మినహాయింపునిచ్చింది. అంతేకాదు సదరు ఖాతాలను ఎన్‌పీఏలుగా పరిగణించరాదని కూడా ఆయా బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థలకు ఆదేశాలిచ్చింది. సాధారణంగా రుణ గ్రహీతలు 90 రోజులకు పైగా చెల్లింపులను చేయకపోతే బ్యాంక్ ఆ ఖాతాను ఎన్‌పీఏగా పరిగణిస్తారు. అయితే తాజా ఆర్‌బీఐ నిర్ణయం వెలువడిన తరువాత పలువురు వినియోగదారుల్లో క్రెడిట్ కార్డు రుణాల పరిస్థితిపై అనేక సందేహాలు వెల్లువెత్తాయి. దీనిపై ఆర్‌బీఐ వివరణ ఇచ్చింది. క్రెడిట్ కార్డు రుణాలు లేదా బకాయిలకు మూడు నెలల మారటోరియం వర్తించదని స్పష్టం చేసింది. ఆయా చెల్లింపులను నిబంధనల ప్రకారం వినియోగదారులు తప్పకుండా చెల్లించాలని తెలిపింది. గృహ రుణాలు, వ్యక్తిగత రుణాలు, విద్యా రుణాలు లాంటివి మాత్రమే టర్మ్ లోన్స్ పరిధిలోకి వస్తాయని చెప్పింది. దీంతో ఈ కష్టకాలంలో ఊరట లభిస్తుందని ఆశించిన క్రెడిట్ కార్డు వినియోగదారులు ఉసూరుమన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos