ఈ-పాస్ లేదంటే…హోసూరుకు నో ఎంట్రీ

ఈ-పాస్ లేదంటే…హోసూరుకు నో ఎంట్రీ

హోసూరు :  సొంత పనులపై కర్ణాటకకు వెళ్లి తిరిగి హోసూరుకు రావాలన్నా ఈ-పాస్ ఉంటేనే అనుమతిస్తామని అధికారులు ఆంక్షలు విధించారు. హోసూరు నుంచి రోజూ వేల మంది కార్మికులు, హోసూరు ప్రాంత ప్రజలు బెంగళూరుకు వెళ్లి వస్తుంటారు. హోసూరు నుంచి కర్ణాటకకు ఉద్యోగాలకు వెళ్లే వారు తమ గుర్తింపు  కార్డులను పోలీసులకు చూపించి కంపెనీలకు వెళ్లే వారు. కానీ ఈ రోజు నుంచి  గుర్తింపు కార్డులు చూపిస్తే సరిపోదు. హోసూరు నుంచి కర్ణాటకకు వెళ్లేవారు తప్పనిసరిగా ఈ-పాస్ తీసుకుని వెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఈ-పాస్ లేకుండా కర్ణాటకకు వెళితే, తిరిగ హోసూరుకు అనుమతించరు. పోలీసులు గత రెండు రోజులుగా కర్ణాటకకు వెళ్లే వారికి ఈ ఉత్తర్వులు గురించి చెప్పినా వారు పట్టించుకోలేదు. ఈ రోజు ఉదయం నుంచి ఆంక్షలను పకడ్బందీగా అమలు చేయడంతో

కర్ణాటకకు వెళ్లే కార్మికులు అవాక్కయ్యారు. కర్ణాటకలోకి  ప్రవేశిస్తే అక్కడే ఉండిపోవాలని అధికారులు చెప్పడంతో జూజువాడి సరిహద్దులో ఉద్రిక్తతకు దారితీసింది. ఒక పక్క తమిళనాడు పోలీసులు, మరోపక్క అత్తిపల్లి వద్ద కర్ణాటక పోలీసులు ఆంక్షలను కఠినతరం చేయడంతో హోసూరు-బెంగళూరు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించాయి. అదేవిధంగా కర్ణాటక నుంచి హోసూరు పారిశ్రామిక వాడకు వచ్చే కార్మికులను తమిళనాడు పోలీసులు అనుమతించకుండా వెనక్కు పంపారు. ఈ-పాసులు ఉన్నవారిని మాత్రం తమిళనాడుకు అనుమతించారు. ఒక్కసారిగా ఇరు రాష్ట్రాలకు చెందిన పోలీసులు ఆంక్షలను కట్టుదిట్టంగా అమలు చేయడంతో కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos