నేను భారతీయురాలినైతే.. బీహార్‌ సీఎంగా పోటీ చేసేదాన్ని.

నేను భారతీయురాలినైతే.. బీహార్‌ సీఎంగా పోటీ చేసేదాన్ని.

న్యూ ఢిల్లీ: జనాభా నియంత్రణపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. పలు రాజకీయ పార్టీల నేతలు ఆయన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. నితీశ్ వ్యాఖ్యలపై అమెరికన్ సింగర్, ఆఫ్రికన్-అమెరికన్ నటి మేరీ మిల్బెన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఓ భారత పౌరురాలిని అయి ఉంటే బీహార్ సీఎం పదవికి పోటీ చేసి ఉండేదాన్నని పేర్కొన్నారు. ‘ముఖ్య మంత్రి నితీశ్ కుమార్ జీ వ్యాఖ్యల తర్వాత ధైర్యవంతు రాలైన మహిళ ముందుకు రావాలి. బీహార్ ముఖ్యమంత్రిగా పోటీ చేసేందుకు అభ్యర్థిత్వాన్ని ప్రకటించాలి. నేను భారతీయురాలినైతే.. బీహార్కు వెళ్లి ముఖ్యమంత్రిగా పోటీ చేసేదాన్ని. బీహార్ ప్రజలారా, భారత ప్రజలారా మహిళకు ఓటు వేసే శక్తిమీకుంది. మార్పుకు ఓటు వేసే శక్తి మీకు ఉంది. ధైర్యవంతురాలైన మహిళ బీహార్ సీఎంగా తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించాల్సిన సమయం ఆసన్న మైంది. బీహార్లో నాయకత్వానికి ఓ మహిళకు సాధికారత కల్పించాలని నేను కోరుతున్నా. జవాన్ చిత్రంలో షారుఖ్ ఖాన్ చెప్పినట్టు ఓటు వేసి మార్పు తీసుకురావాలి’ అని ఆమె పేర్కొన్నారు. ఇటీవల బీహార్లో నిర్వహించిన కులగణనకు సంబంధించి నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా నితీశ్ మాట్లాడుతూ ‘భర్తల చర్యల వల్ల జననాలు పెరిగాయి. అయితే చదువుకున్న మహిళలకు తన భర్తను ఎలా నియంత్రించాలో తెలుసు. అందుకే ఇప్పుడు జననాల రేటు తగ్గుతూ వస్తున్నది’ అని మాట్లాడారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos