మోదీపై బాణం ఎక్కుపెట్టిన నితీశ్ కుమార్

మోదీపై బాణం ఎక్కుపెట్టిన నితీశ్ కుమార్

పాట్నా : ‘ప్రధాని మోదీ 2014లో గెలిచారు. 2024 గురించి ఆయన ఇక ఆందోళన చెందవలసిందేన’ని బిహార్ ముఖ్య మంత్రిగా ఎనిమిదో సారి ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్ కుమార్ ఒక వార్తా సంస్థతో అన్నారు. ఇంకా..‘మా నూతన ప్రభుత్వం త్వరలోనే కుప్పకూలిపోతుందని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. మా ప్రభుత్వం బాగా నడు స్తుంది. బీజేపీని వదిలిపెట్టాలని జేడీయూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకుంది. నా ప్రభుత్వం 2024 వరకు ఉన్నా, లేకపోయినా, బీజేపీ కావాలనుకున్నది మాట్లాడవచ్చు. కానీ నేను మాత్రం 2014లోనే ఉండిపోను’ అన్నారు. ఆర్జేడీ నేత శరద్ యాదవ్ మాట్లాడుతూ, 2024 లోక్సభ ఎన్నికలకు నితీశ్ కుమార్ ఆదర్శప్రాయమైన ప్రధాన మంత్రి అభ్యర్థి అని చెప్పారు. ఆయన మహా కూటమి తరపున ప్రధాని కాగలరన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos