బీజేపీకి జేడీయూ బైబై

బీజేపీకి జేడీయూ బైబై

పాట్నా: బీజేపీ – జేడీయూ బంధం తెగింది. బీజేపీతో భాగస్వామ్యం ముగిసిపోయిందని మంగళవారం ఇక్కడ జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు. సాయంత్రం నాలుగు గంటలకు గవర్నర్ను నితీశ్ కుమార్ కలసి ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు గురించి వివరించనున్నారని పార్టీ వర్గాల కథనం. ప్రస్తుత పరిణామాలకు బీజేపీ స్వయంకృతాపరాధమే కారణమని విశ్లేషకులు అంటున్నారు. జనతాదళ్(యునైటెడ్) జాతీయ మాజీ అధ్యక్షుడు, కేంద్ర తాజా మాజీ మంత్రి ఆర్సీపీ సింగ్ శనివారం పార్టీకి రాజీనామా చేయడంతో బీజేపీ-జేడీయూ బంధంలో బీటలు మరింత తేటతెల్లమయ్యాయి. నిజానికి ఆయనను కేంద్ర మంత్రిగా బీజేపీ ఏకపక్షంగా ఎంపిక చేసింది. ఆయన అమిత్షాకు దగ్గరవుతున్నట్లు గుర్తించిన నితీశ్ ఈసారి రాజ్యసభ సభ్యత్వాన్ని పునరుద్ధరించలేదు. ముందు నుంచీ కేంద్ర సర్కారులో రెండు స్థానాలు కావాలని నితీశ్ కోరినా బీజేపీ పట్టించుకోలేదు. దాంతో.. లోక్ జనశక్తి మాదిరిగా ఆర్సీపీ సింగ్ ద్వారా జేడీయూను చీల్చేందుకు బీజేపీ కుట్రపన్నుతోందని నితీశ్ అనుమానించారు. ఆర్సీపీ సింగ్ కూతురి అవినీతిపై నిలదీశారు. దీంతో ఆర్సీపీ సింగ్ రాజీనామా చేశారు. ఇక 2017లో లాలూ అవినీతిని ఎత్తిచూపుతూ.. సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలగి, బీజేపీతో జతకట్టిన జేడీయూ 2020లో ఎన్డీయే తరఫున బరిలో దిగి 43 సీట్లకు పరిమితమైంది. 74 స్థానాలు సాధించిన బీజేపీ, నితీశ్కే అధికారాన్ని కట్టబెట్టింది. బిహార్పై పట్టుకు షా ప్రయత్నిస్తుండడంతో ఆర్సీపీ సింగ్ మరో ఏక్నాథ్ షిండేలా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదని జేడీయూ అధిపతి భావించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos