కన్నీటిపర్యంతమైన నితిన్ పటేల్

కన్నీటిపర్యంతమైన  నితిన్ పటేల్

అహ్మదాబాద్: గుజరాత్ ముఖ్య మంత్రి పదవి కోసం తాపత్రయపడిన ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ సోమ వారం ఉదయం కన్నీటి పర్యంతమయ్యారు. కాబోయే ముఖ్య మంత్రి భూపేంద్ర పటేల్ సోమవారం ఉదయం నితిన్ పటేల్ కలిశారు. అనంతరం నితిన్ పటేల్ విలేఖరులతో మాట్లాడారు. ‘‘భూపేంద్ర పటేల్ నాకు పాత కుటుంబ స్నేహి తుడు. నేను అతడిని అభినందించాను. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు సంతోషించాను. పదవి రాలేదని కలత చెందలేదు. నేను 18 సంవత్సరాలుగా బీజేపీలో ఉన్నా, స్థానం లభించినా, లేకపోయినా, నేను పార్టీలో సేవ చేస్తూనే ఉంటాన’న న్నారు. భూపేంద్ర పటేల్ కలిసిన తర్వాత నితిన్ పటేల్ కళ్లలో నీళ్లు వచ్చాయి. ‘బీజే పీ నాకు చాలా ఇచ్చింది. ఎలాంటి బాధలు లేవు. ఎన్నో ఒడిదు డుకులు చూశా. ప్రజల హృదయంలో నేనున్నా.సీఎం అభ్యర్థిని ప్రక టించాక నేను అసంతృప్తితో ఉన్నానని వచ్చిన వార్తలు ఊహా గానాల’ని చెప్పారు.

తాజా సమాచారం