రేపిస్టులకు మద్దతు తెలుపుతూ జీవనోపాధి పొందుతున్నారు..

రేపిస్టులకు మద్దతు తెలుపుతూ జీవనోపాధి పొందుతున్నారు..

నిర్భయ దోషులను క్షమించాలంటూ సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ చేసిన అభ్యర్థనపై నిర్భయ తల్లి తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వారి వల్లే అత్యాచార బాధితులకు న్యాయం జరగడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉరిశిక్షకు తాను వ్యతిరేకమని, నిర్భయ దోషులను ఆమె తల్లి ఆశాదేవి క్షమించాలని ఆమె కోరారు. విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీని ఆదర్శంగా తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా సూచించారు.ఇందిరా చేసిన సూచనలపై ఆశాదేవి త్వీవ్రస్థాయిలో మండిపడ్డారు.న్యాయవాది అయిఉండి అటువంటి పనికిమాలిన సలహా ఎలా ఇవ్వగగిందని అసలు తనకు సలహా ఇవ్వడానికి ఆమె ఎవరని ప్రశ్నించారు. ఉరి తీయాలని దేశమంతా కోరుకుంటుంటే, క్షమించమనేంత ధైర్యం ఆమె ఎలా చేయగలిగారని మండిపడ్డారు. గతంలో ఇందిరను చాలాసార్లు కలిసినా తన క్షేమ సమాచారాల గురించి ఎప్పుడూ అడగలేదని, ఇప్పుడు మాత్రం దోషుల తరపున వకాల్తా పుచ్చుకుని క్షమించమని కోరుతున్నారని ఇందిర వంటి వాళ్లు రేపిస్టులకు మద్దతు పలుకుతూ జీవనోపాధి పొందుతూ ఉంటారని ఆశాదేవి ఫైరయ్యారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos