ఇక వాటి జోలికెళ్లను..

  • In Film
  • December 2, 2019
  • 57 Views
ఇక వాటి జోలికెళ్లను..

మొదట్లో కొంతమంది హీరోలను అనుకరిస్తున్నాడనే విమర్శలు ఎదుర్కొన్నా త్వరగా వాటి నుంచి బయటపడి కొద్ది సంవత్సరాలుగా కొత్తదనం నిండిన చిత్రాల్లో నటిస్తూ యువహీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.అయితే క్రితం ఏడాది రీమేక్ మూవీ అయినకిరాక్ పార్టీలో నటించాడు. సినిమా ఆయనతో పాటు అభిమానులను పూర్తిగా నిరాశపరిచింది.ఇక ఇటీవల ఆయన చేసినఅర్జున్ సురవరంకూడా కోలీవుడ్ నుంచి కొనుక్కొచ్చిన కథనే. సినిమా మాత్రం మంచి వసూళ్లను రాబడుతోంది. దాంతో ఇకపై నిఖిల్ రీమేక్ లకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే అవకాశం ఉందని అనుకున్నారు. కానీఇకపై రీమేక్ సినిమాలు చేయనుఅనే విషయాన్ని నిఖిల్‌ స్పష్టం చేయడం ఆశ్చర్యకరం. పాపం రీమేక్ సినిమాల వలన ఎలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయోగానీ కుర్రాడు గట్టి నిర్ణయమే తీసుకున్నాడని చెప్పుకుంటున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos