ప్రపంచానికి ముప్పుగా పరిణమిస్తున్న కరోనా..

ప్రపంచానికి ముప్పుగా పరిణమిస్తున్న కరోనా..

కరోనా వైరస్ కు సంబంధించి మరో కొత్త విషయాన్ని గుర్తించారు. మావత్ ప్రపంచం ఉలిక్కిపడేలా ఉన్న విషయంలోకి వెళితే.. ఎవరైనా వ్యక్తిలో కొవిడ్ – 19 పాజిటివ్ తేలాక చికిత్స చేయటం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిని అంటేసిన వైరస్ మహమ్మారికి సంబంధించి మరో దరిద్రపు గుణాన్ని గుర్తించారు. అదేమంటే.. కరోనా పాజిటివ్ తేలిన వ్యక్తికి చికిత్స చేసి.. నయం చేసిన తర్వాత కూడా వైరస్ ను ఇతరులకు అంటించే లక్షణాలు ఉంటాయని గుర్తించారు. దీంతో.. వైరస్ తగ్గిందని సంతోషిస్తే సరిపోదు.. వారిని పూర్తిగా నయమయ్యే వరకూ బయటకు పంపకూడదన్న కొత్త విషయాన్ని గుర్తించారు. తాజాగా చేసిన పరిశోధనల్లో వైరస్ నయమైన వారిలో ఎనిమిది రోజలు పాటు అంటించే సామర్థ్యం ఉంటుందని చెబుతున్నారు. దీంతో.. వైరస్ ను నియంత్రించటం అనుకున్నంత తేలిక కాదని చెబుతున్నారు. అమెరికాలోని యేల్ వర్సిటీ పరిశోధకులు.. చైనాలోని పీఎల్ఏ జనరల్ ఆసుపత్రి నిపుణులు పరిశోధనలు చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. టీంలో భారత సంతతికి చెందిన పరిశోధకుడు కూడా ఉన్నారు.ఇప్పటివరకూ అనుసరిస్తున్న విధానం ప్రకారం కరోనా సోకిన వారిని ప్రత్యేకంగా చికిత్స చేయటం.. వ్యాధి నయమైన తర్వాత వారికి ఒకటికి రెండుసార్లు పరీక్షలు జరిపి..నెగిటివ్ అని తేలిన తర్వాత.. తగు జాగ్రత్తలు చెబుతూ డిశ్చార్జ్ చేస్తున్నారు. ఇలా ఇంటికి పంపుతున్న వారిని చైనాలో క్రాస్ చెక్ చేశారు. పాలీమరేజ్ చైన్ రియాక్షన్ పరీక్షల్లో వైరస్ లేదని తేలిన తర్వాత పంపేస్తున్న వారిని వేరుగా చైనాకు చెందిన ఒక టీం ట్రాక్ చేసింది. నిత్యం వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని రా తీసింది.షాకింగ్ నిజం ఏమంటే.. పరీక్షల్లో వైరస్ లేదని తేలిన తర్వాత కూడా.. డిశ్చార్జ్ అయిన రోగుల్లో సగం మంది వైరస్ ను వ్యాప్తి చేస్తున్న విషయాన్ని గుర్తించారు. దీంతో.. ఇన్ఫెక్షన్ బారిన పడిన వారు కోలుకున్న తర్వాత కూడా ఎక్కువ కాలం బయటకు రాకుండా చేయాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని గుర్తించారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న వారి విషయంలో ఇది మరింత ఎక్కువగా ఉందని గుర్తించారు. దీంతో.. వైరస్ బారిన పడి.. కోలుకున్న వారుమరో రెండు వారాల పాటు హోం క్వారంటైన్ లో తప్పనిసరిగా ఉండాలని చెబుతున్నారు. మాత్రం నిర్లక్ష్యం చేసినా.. వైరస్ వ్యాప్తికి వారు ప్రధాన కారణం అవుతారన్న విషయాన్ని గుర్తించారు. కరోనా మీద పోరాడుతున్న ప్రపంచానికి తాజా పరిశోధన ఫలితం మరింత వేదనకు గురి చేస్తుందని చెప్పక తప్పదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos