టైప్2 మధుమేహానికి సరికొత్త చికిత్స

టైప్2 మధుమేహానికి సరికొత్త చికిత్స

టైప్2 మధుమేహం, స్థూలకాయంతో బాధపడే వారికి ఇప్పటివరకు బేరియాట్రిక్ సర్జరీ చేసి, ఉదరం పరిమాణం తగ్గించేవారు. ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో, ఆ చికిత్స అందరూ చేయించుకోలేరు. ఈ నేపథ్యంలో ‘స్లీవ్ బెలూన్’ అనే సరికొత్త చికిత్సా విధానాన్ని బ్రిటన్‌లోని కింగ్స్ కళాశాల శాస్త్రవేత్తలు అభివృద్ధిపరిచారు. ప్రయోగాత్మకంగా ‘స్లీవ్ బెలూన్’ను ఎలుకల ఉదరంలోకి ప్రవేశపెట్టారు. దీంతో వాటి ఆకలి తగ్గి, స్థూలకాయం, మధుమేహ సమస్యలు దూరమవడాన్ని గుర్తించారు. ఇందులోనూ బేరియాట్రిక్ సర్జరీ తరహాలోనే ఫలితాలు వచ్చినట్లు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos