దిశను హత్యాచారం చేసినపుడు ఎందుకు నోరు మెదపలేదు?

దిశను హత్యాచారం చేసినపుడు ఎందుకు నోరు మెదపలేదు?

దిశ నిందితుల ఎన్‌కౌంటర్ పై ప్రజాసంఘాలు, మానవ హక్కుల సంఘాలు వ్యతిరేకంగా స్పందిస్తుండడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దిశను అత్యంత దారుణంగా చంపినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఘటన జరిగిన వారం రోజుల వరకు ఎందుకు నోరు మెదపలేదు? అప్పుడెక్కడికి వెళ్లారు మీరందరూ అంటూ సామాజిక మాధ్యమాల్లో తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై కేసులు పెట్టాలంటూ హక్కుల సంఘాల నేతలు, సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తుండడం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు.అన్యాయం జరిగినప్పుడు ఇలాంటి వాళ్లు బయటికి రారని, వచ్చినా సమస్యను పరిష్కరించరని విమర్శిస్తున్నారు. న్యాయం జరిగిన తర్వాత బయటికొచ్చి దాంట్లో లొసుగులు గుర్తించి ప్రచారం పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటారని, సమస్యను మరింత తీవ్రం చేయడానికి వస్తారని నెటిజన్లు మండిపడుతున్నారు. దేశం యావత్తూ దిశకు న్యాయం జరిగిందని సంతృప్తి వ్యక్తం చేస్తుంటే, వీళ్లు మాత్రం ఒకమ్మాయికి అన్యాయం జరిగినా కానీ, నలుగురు దుర్మార్గులను కాపాడాలని పోరాడడం ఏం న్యాయమని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.మరి ఈ ‘మానవ’హక్కుల సంఘాలకు,ప్రజాసంఘాల నేతలకు, హైకోర్టులో,సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిన మహిళా సంఘాలకు,న్యాయవాదులకు ఎప్పుడు తెలిసొస్తుందో ఏమో!ఇక ఒక అమ్మాయి కోసం నలుగురిని అన్యాయం పొట్టనపెట్టుకున్నారంటూ నిందితుల్లో ఒకడైన చెన్నకేశవులు భార్య లక్ష్మీ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు మరింత తీవ్రస్థాయిలో,తీవ్ర పదజాలంతో మండిపడుతున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos