ఎన్డీయే ను గెలిపించిన ఎన్నికల సంఘం

ఎన్డీయే ను గెలిపించిన ఎన్నికల సంఘం

పాట్నా: ‘బిహార్ శాసనసభ ఎన్నికల్లో ప్రజలు మహాకూటమికి అనుకూలంగా తీర్పు ఇస్తే.. ఎన్నికల సంఘం ఎన్డీయేకు అనుకూలంగా ఫలితాలు విడుదల చేసింద’ని మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ ప్రతాప్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘బిహార్ ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎన్నికల్లో ప్రజలు మహాకూటమికి అనుకూలంగా తీర్పునిచ్చారు. కానీ ఎన్నికల సంఘం ఎన్డీయేకు అనుకూలంగా ఫలితాలు విడుదల చేసింది. నిజానికి ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. 2015లో కూడా దాదాపు ఇలాంటిదే జరిగింది. ప్రజలు భారీ మెజారిటీతో మహాకూటమికి పట్టం కట్టారు. కానీ అధికారం కోసం బీజేపీ దొడ్డిదారులు వెతుక్కుంది. ప్రజాతీర్పుకు వ్యతిరేకంగా వ్యవహరించింది. ఈ ఎన్నికల ఫలితాల్లో మహాకూటమి 119 స్థానాలు గెలిచింది. అయితే అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి 110 స్థానాలే గెలిచినట్లు ఈసీ ప్రకటించింది. చాలా మంది అభ్యర్థులు అతి స్వల్ప మెజారిటీతో గెలుపొందడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నా’యని దుయ్యబట్టారు. తమ అభ్యర్థులే గెలిచారనడానికి ఆర్జేడీ కొన్ని రుజువులు చూపించే ప్రయత్నం చేస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos