పాక్‌ మాజీ ప్రధానికి తీవ్ర అస్వస్థత..

పాక్‌ మాజీ ప్రధానికి తీవ్ర అస్వస్థత..

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు.ప్లేట్లెట్లు ప్రమాదకరస్థాయికి పడిపోవడంతో వ్యక్తిగత వైద్యుడి సూచన మేరకు జైలు అధికారులు ఆయనను లాహోర్‌లోని నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో కార్యాలయం నుంచి నేరుగా లాహోర్ సర్వీసెస్ ఆసుపత్రికి తరలించారు.పనామా పత్రాల కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్న నేపథ్యంలో నవజ్ షరీఫ్‌కు చికిత్స అందిస్తున్న గదిని తాత్కాలిక సబ్‌జైలుగా ప్రకటించిన అధికారులు ఆసుపత్రి వద్ద బందోబస్తు కట్టుదిట్టం చేశారు.కుటుంబ సభ్యులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రతిపక్ష నేత షెహబాజ్ షరీఫ్ ఆసుపత్రిని సందర్శించి నవాజ్‌ను పరామర్శించారు.

తాజా సమాచారం