తాలిబన్లు ఓ శాపం

తాలిబన్లు ఓ శాపం

ముంబై : తాలిబన్లను సమర్థించిన భారతీయ ముస్లింలపై ప్రముఖ బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా ఆగ్రహించారు. ‘ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి రావడం యావత్తు ప్రపంచానికి ఆందోళనకరం. అయినా భారతీయ ముస్లింలలోని కొన్ని వర్గాలు సంబరాలు చేసుకుంటున్నారు. ఆటవికుల సంబరాలు తక్కువ ప్రమాదకరమేమీ కాదు. ఇస్లాంను సంస్కరించి, ఆధునికతకు మద్దతివ్వాలో, లేదంటే, ఆటవిక, అనాగరిక, క్రూరమైన సంప్రదాయాలు, విలువలతో కలిసి జీవించాలో భారతీయ ముస్లింలు తమను తాము ప్రశ్నించుకోవాలి. కచ్చితంగా తాలిబన్లు ఓ శాపం. హిందుస్థానీ ఇస్లాం ఎల్లప్పుడూ ప్రత్యేకమైనది. మనం గుర్తించలేనంతగా మార్పులు జరిగే సమయం రాకుండా అల్లా చూడాల’న్నారు.

తాజా సమాచారం