భూమిని పోలిన మరో గ్రహంపై జీవం ఉనికి

భూమిని పోలిన మరో గ్రహంపై జీవం ఉనికి

వాషింగ్టన్: అంతరిక్షంలో భూమిని పోలిన గ్రహాలను, వాటిపై జీవం ఉనికిని గుర్తించినట్లు నాసా ప్రకటించింది. మన సౌర కుటుంబానికి ఆవల సుదూరంలో భూమిని పోలిన గ్రహాన్ని గుర్తించామని, దానిపై సముద్రం ఆనవాళ్లు కనిపించాయని చెప్పింది. భూమితో పోలిస్తే ఈ గ్రహం దాదాపు 8.6 రెట్లు పెద్దగా ఉంటుందని తెలిపింది. ఈ కొత్త గ్రహాన్ని నాసా శాస్త్రవేత్తలు కే2-18 బి గా వ్యవహరిస్తున్నారు. ఇది భూమికి దాదాపు 120 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని వివరించారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ సాయంతో కే2-18 బి గ్రహాన్ని గుర్తించినట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గ్రహంపై మీథేన్, కార్బన్ డయాక్సైడ్ ఉనికిని గుర్తించినట్లు వివరించారు. ఇప్పటి వరకు జరిగిన పరిశోధనలు, మీథేన్, కార్బన్ డయాక్సైడ్ ఉనికి ఆధారంగా ఈ గ్రహం ఉపరితలం కింద మహా సముద్రం ఉండొచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు, జీవం ఉన్నచోట మాత్రమే ఉత్పత్తయ్యే డిమెథైల్ సల్ఫైడ్ (డీఎంఎస్) ఆనవాళ్లను కూడా ఈ గ్రహంపై గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos