న్యూ ఢిల్లీ: శుభాన్షు శుక్లా రోదసి యాత్ర మరోసారి వాయిదా పడింది. ఇటీవలే ఈ యాత్రను మిషన్‌ను జూన్ 19న చేపట్టనున్నట్లు గతవారం ఇస్రో ప్రకటించింది. అది ఇప్పుడు ఈనెల 22కు వాయిదా పడింది. ఈ విషయాన్ని అమెరికా ప్రైవేట్ స్పేస్ సంస్థ ‘యాక్సియమ్’ ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవలే చేపట్టిన మరమ్మతులు, వాతావరణ పరిస్థితులు, సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకని తదుపరి ప్రయోగ తేదీ నిర్ణయించినట్లు వెల్లడించింది.