తెలుగులోకి మరో మలయాళి అందం..

  • In Film
  • February 25, 2020
  • 139 Views
తెలుగులోకి మరో మలయాళి అందం..

తమిళంలో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ధనుష్‌ నటించిన అసురన్‌ చిత్రానికి రీమేక్‌గా తెలుగులో వెంకటేశ్‌ హీరోగా తెరకెక్కుతున్న నారప్ప చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.కొద్ది రోజులుగా తమిళనాడులో రెడ్‌ డెసర్ట్‌ ప్రాంతంలో చిత్రీకరణ జరుపుకొంటోంది.ఇక ఈ చిత్రంలో మెయిన్‌ హీరోయిన్‌గా ప్రియమణి నటిస్తుండగా మరో హీరోయిన్‌గా మలయాళం నటి రెబా మోనికా జాన్‌ నటిస్తున్నారు.తాజాగా రెబా సైతం నారప్ప చిత్రీకరణలో పాల్గొన్నారు.చూడగానే ఆకర్షించే చక్కనైన రూపం,అందం ఉన్న రెబాకు మలయాళంలో విపరీతమైన క్రేజ్‌ ఉంది.తెలుగులో నారప్పతో ఎంట్రీ ఇవ్వనున్న రెబా నారప్ప విజయం సాధిస్తే తెలుగులో బిజీ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos