కారుణ్య మరణానికి నళినీ మొర

కారుణ్య మరణానికి నళినీ మొర

చెన్నై: దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులు నళినీ శ్రీ హరన్, ఆమె భర్త మురుగన్ కారుణ్య మరణానికి అనుమ తివ్వాల ని మద్రాసు ఉన్నత న్యాయస్థానానికి విన్నవించారు. తీవ్రమైన ఒత్తిడి వల్ల ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆమె న్యాయవాది పుహళేంది పేర్కొన్నారు. కారాగార అధికారుల సాయంతో ప్రధాని మోదీకీ ఆమె లేఖ రాశారని వివరించారు. ‘మేము విడుదల వు తామని గత 26 ఏళ్లుగా నిరీక్షిస్తున్నాం. ఇప్పుడు ఆ ఆశలన్నీ ఆవిరవుతున్నాయి. జైలు అధికారులు నా భర్త మురుగ న్ను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. నా భర్త పడుతున్న బాధలు చూడలేక పోతున్నా. అందువల్ల కారుణ్య మరణానికి అనుమతించంద’ ని ఆ లేఖలో నళిని కోరినట్లు పుహళేంది తెలిపారు. వెల్లూరు చెరసాల నుంచి పుఝల్ కారాగారానికీ తరలిం చాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. వెల్లూరు చెరసాల సిబ్బంది తమను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిం చారు. మురుగన్ వద్ద చరవాణి లభించడంతో అధికారులు ఆయనను ఒంటరిగా ఉంచుతున్నారు. దీనికి నిరసనగా గత పది రోజుల నుంచి నళిని, మురుగన్ నిరాహార దీక్ష చేస్తున్నారు. నళినిని ప్రస్తుతం వెల్లూరులోని ప్రత్యేక మహిళా జైల్లో ఉంచారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురి విడుదలకు తమిళనాడు ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ఆమోదం ఇంకా లభించాల్సి ఉంది.

తాజా సమాచారం