నాగశౌర్య ఫామ్ హౌజ్‌పై పోలీసుల దాడులు.. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

నాగశౌర్య ఫామ్ హౌజ్‌పై పోలీసుల దాడులు.. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

హైదరాబాద్ : నగర శివారులో సినీ హీరో నాగశౌర్య ఫామ్హౌస్లో పేకాట ఆడుతున్న కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ వారాంతంలో భారీ ఎత్తున పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ నుండి కూడా ప్రతి వారం ఇక్కడకు వచ్చి పేకాటలో తమ అదృష్టం పరీక్షించుకుంటారని తెలుస్తుంది. అరెస్ట్ అయిన వారిలో కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే శ్రీరాం భద్రయ్య కూడా ఉన్నారు. ఆయన మహబూబాబాద్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇతర నిందితుల్లో పలువురు ప్రముఖులు కూడా ఉన్నట్టు సమాచారం. పేకాట ఆడిస్తున్న గుత్తా సుమన్కుమార్ ను పోలీసులు అరెస్టు చేసారు. గుత్తా సుమన్కుమార్ హైదరాబాద్లో పలుచోట్ల క్యాషినో ఆడిస్తున్నట్టు పోలీ సులు గుర్తించారు. ఇందులో భాగంగానే ఫామ్హౌస్లు అద్దెకు తీసుకుని పేకాట ఆడిస్తున్నాడు. అంతేకాకుండా హైదరాబాద్లో సుమన్ కుమార్ చాలా మందిని ఉద్యోగాలు, రియల్ ఎస్టేట్ పేరిట మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. సుమన్ కుమార్ ఫోన్లో పలువురు వీఐపీల ఫోన్ నెంబర్లను కూడా పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన పలువరు రాజకీయ నాయకులతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి. ఎన్జీవో పేరుతో విరాళాలు ఇస్తున్నట్టుగా, వీఐపీలతో పరిచయాలు ఉన్నట్టుగా ఫొటోలు దిగి మోసాలకు పాల్పడేవాడనని ఎస్వోటీ పోలీసులు గుర్తించినట్టుగా సమాచారం. పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos