పరిశ్రమలు ఆరంభం కాని స్థలాలు స్వాధీనం

పరిశ్రమలు ఆరంభం కాని స్థలాలు స్వాధీనం

ప్రజావాహిని – బెంగళూరు

రాయచూరు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు కేటాయించిన స్థలాల్లో లబ్ధిదార్లు పరిశ్రమల్ని ప్రారంభించని పక్షంలో ఆ స్థలాల్ని స్వాధీనం చేసుకుని కొత్తగా పరిశ్రమలు ప్రారంభించదలచిన వారికి కేటాయిస్తామని చిన్న తరహా పరిశ్రమ మంత్రి ఎన్‌.నాగరాజు శుక్రవారం విధానసభలో తెలిపారు. మాన్వి శాసనసభ్యుడు రాజా వెంకటప్ప నాయక్‌ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు బదులిచ్చారు. చాలా మంది ఔత్సాహిక పారిశ్రామికులు పరిశ్రమల స్థాపనకు స్థలాల కోసం ధరఖాస్తు చేసి ఏళ్లుగా నిరీక్షిస్తున్నారని నాయక్‌ తెలిపారు. ఈ సమస్య పాక్షికంగా అయినా నివారణకు ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో పరిశ్రమలు కానీ పక్షంలో ఆ జాగాల్ని స్వాధీనం చేసుకోవాలని చేసిన వినతికి మంత్రిసానుకూలంగా స్పందించారు. మాన్వి, లింగసుగూరు తాలూకాల్లో కర్మాగారాల స్థాపనకు తగిన స్థలాల కోసం 280 మంది దరఖాస్తు చేసారని నాగరాజు మరో ప్రశ్నకు బదులుగా వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos