లక్ష్యాన్ని చేధించిన నాగ్ ‘అస్త్రం’

లక్ష్యాన్ని చేధించిన నాగ్ ‘అస్త్రం’

న్యూ ఢిల్లీ : దేశీయంగా రూపొందించిన నాగ్ క్షిపణి తుది ప్రయోగాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీఓ) గురువారం విజయవంతంగా నిర్వహించింది. దీంతో ఇది సైన్యంలో చేరేందుకు సిద్ధమైంది. ‘డీఆర్డీఓ అభివృద్ధి చేసిన నాగ్ క్షిపణి తుది ప్రయోగాన్ని భారత్ విజయవంతంగా పరీక్షించింది. రాజస్థాన్ పోఖ్రాన్ ప్రాంతంలోని ఫైరింగ్ రేంజ్ నుంచి ఉదయం 6.45 గంటల ప్రాంతంలో ఈ ప్రయోగం చేపట్టాం. నాగ్ క్షిపణి.. శత్రు దేశాల యుద్ధ ట్యాంకులు, ఇతర సాయుధ వాహనాలను ధ్వంసం చేయగలదు. 4-7 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలద’ని డీఆర్డీఓ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. మూడోతరం క్షిపణి-నాగ్ టీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. ప్రత్యర్థుల యుద్ధ నౌకలను పగలు, రాత్రి అనే తేడా లేకుండా విజయవంతంగా ధ్వంసం చేస్తుంది. భారత సైన్యం ప్రస్తుతం రెండోతరం మిలాన్ 2టీ కొంకుర్ ఏటీజీఎమ్ను వినియోగిస్తోంది. ప్రత్యర్థుల అత్యాధునిక యుద్ధ ట్యాంకులను నిలవరించాలంటే మూడోతరం క్షిపణుల కోసం వేచిచూస్తోంది సైన్యం. నాగ్తో ఆ అవసరం తీర నుంది.భారత సైన్యం కోసం 300 నాగ్ క్షిపణులు, 25 ఎన్ఏఎమ్ఐసీఎస్లను సమకూర్చుతామని 2018లో రక్షణ శాఖ వెల్లడించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos