సస్పెన్షన్​ను ప్రజాస్వామ్య వ్యతిరేకమా..

సస్పెన్షన్​ను ప్రజాస్వామ్య వ్యతిరేకమా..

న్యూ ఢిల్లీ: రాజ్యసభ సభ్యులు 12 మంది సస్పెన్షన్ను ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఎందుకు అభివర్ణిస్తున్నారో తనకు అర్థం కావడం లేదని ఛేర్మన్ వెంకయ్య నాయుడు అన్నారు. ‘ఇలా సస్పెన్షన్ విధించడం ఇదే తొలిసారి కాదు. 1962 నుంచి 2010 వరకు 11 సార్లు జరిగింది. నిరసన వ్యక్తం చేస్తున్న సభ్యులు సస్పెన్షన్ ఎందుకు విధించా రన్న కారణాలపై ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. 12 మంది సభ్యులపై సస్పెన్షన్ విధించడాన్ని కొందరు సభ్యులు, నేతలు.. అప్రజాస్వామికంగా అభివర్ణిస్తున్నారు. వారి ప్రచారంలో ఏదైనా వాస్తవికత ఉందేమోనని ఆలోచించా. కానీ నేను అర్థం చేసుకోలేకపోయా. గత ప్రభుత్వాలు సైతం ఇలాంటి సస్పెన్షన్లు విధించాయి. అవన్నీ అప్రజా స్వామికమే అవుతాయా? అలా అయితే.. ఎందుకు అన్ని సార్లు సస్పెన్షన్ విధించారు?’అన్నారు. గత సమావేశాల్లో సభను అపవిత్రం చేసేలా ప్రవర్తించినందుకే సభ్యులపై వేటు వేసినట్లు వివరించారు. ఎన్డీయేతర పార్టీలకు చెందిన చాలా మంది సభ్యులు సస్పెన్షన్ను వ్యతిరేకించారు. నిరసనకు సంఘీభావాన్ని ప్రకటించారు. పార్లమెంట్ ఆవర ణలోని గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన ఆందోళనకు లెఫ్ట్ పార్టీ ఎంపీలూ మద్దతు ఇచ్చారు. ప్రభుత్వంపై వీలైనంత ఒత్తిడి పెడుతున్నామని సీపీఎం ఎంపీ ఎలవరం కరీం పేర్కొ న్నారు. తెరాస తమకు మద్దతు ప్రకటించిందన్నారు. ప్రస్తుతం సమాఖ్య ప్రభుత్వం ఒత్తిడికి లోనవుతోందని అన్నారు. మోదీ సర్కారు భయపడటం సానుకూల అంశ మన్నారు.

తాజా సమాచారం