స్వర్గానికి దారులు పరిచే పెర్ల్‌వ్యాలీ..

స్వర్గానికి దారులు పరిచే పెర్ల్‌వ్యాలీ..

ప్రతిరోజూ ఉరుకులు,పరుగులతో యాంత్రిక జీవితానికి అలవాటు అదే చట్రంలో ఇరుక్కుపోయిన బెంగళూరు నగరవాసులు యాంత్రిక జీవితం నుంచి వారంలో ఒక్క రోజైనా విముక్తి పొందాలని ఆరాపడుతుంటారు.ఈ క్రమంలో వారాంతాల్లో స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలసి నగరానికి దూరంగా అడవుల్లో,పక్షుల కిలకిలలు,సెలయేళ్ల గలగలలు వింటూ ప్రకృతి ఒడిలో సేద తీరడానికి ఆసక్తి చూపుతుంటారు.కొంతమంది దూర ప్రాంతాలను ఎంచుకుంటే మరికొంత మంది బెంగళూరు నగరం చుట్టు పక్కల ప్రాంతాల కోసం వెతుకుతుంటారు.రెండో ఎంపిక కోరుకునే ప్రజల కోసం బెంగళూరుకు సమీపంలోనే స్వర్గానికి దారులు పరిచే అద్భుతమైన ప్రదేశం ఒకటుంది.దట్టమైన అడవులు,మంత్రముగ్ధులను చేసే జలపాతాలు,అరుదైన జంతు,వృక్షజాతులు యాంత్రిక జీవితం నుంచి మిమ్మల్ని మరో్ లోకానికి తీసుకెళతాయి.బెంగళూరు నగరం నుంచి కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనున్న ప్రకృతి అందాల ఒడిలో అలరారుతున్న ముత్యాలమడువు వారంతంలో సేద తీరడానికి నగరవాసులకు చక్కనైన పర్యాటక ప్రదేశం.ముత్యాల మడువు ప్రాంతాన్ని పెర్ల్‌వ్యాలీ ఫాల్స్‌ అని కూడా పిలుస్తుంటారు.ఇక్కడి జలపాతాల నుంచి కిందకు దూకే నీరు ముత్యాలు వరుసగా కిందకు పడిపోతున్నట్లు కనిపించడంతో దీన్ని మత్యాల మదువుగా పిలుచుకుంటారు.ముత్యాల మడువులో చూడాల్సిన ప్రదేశాల గురించి పరిశీలిస్తే..
ముత్యాలమడువు జలపాతం..
సుమారు వంద అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకే జలపాతాన్ని చూస్తే ఆకాశం నుంచి ముత్యాలు నీళ్ల రూపంలో కిందకు దూకుతున్నాయేమోనన్న భావన కలుగుతుంది.అడవుల్లో కొద్దిసేపు ట్రెక్కింగ్‌ చేసిన అలసిపోతే సేద తీరడానికి ముత్యాలమడువు జలపాతానికి చక్కటి ప్రదేశం.జలపాతం వద్ద కొలనులో ఈత కొట్టడం చాలా ప్రత్యేకంగా ఉంటుంది..

ముత్యాలమడువు జలపాతం..

ముత్యాలమడువు జలపాతం వద్ద యువతి సందడి..

పెర్ల్‌వ్యాలీ..
పెర్ల్‌వ్యాలీ అంటే తెలుగులో ముత్యాలలోయ అని అర్థం.పేరుకు తగ్గట్లే పెర్ల్‌వ్యాలీ అరుదైన చెట్లతో,అందమైన పూలతో పచ్చదనాన్ని పరుచుకొని దర్శనమిస్తుంది.వీటి మధ్యలో పక్షుల కిలకిలలు వింటూ ట్రెక్కింగ్‌ చేయడం ఒక ఎత్తైతే లోయలో చెట్ల నుంచి స్వచ్ఛమైన గాలి పూల నుంచి వచ్చే పరిమళం మైమరపిస్తాయి..

పెర్ల్‌వ్యాలీ..

 

 

 

పెర్ల్‌వ్యాలీ..

నీలగిరి తోటలు..
జలపాతం పైభాగాన ఉన్న నీలగిరి తోటను తప్పకుండా చూడాల్సిందే.గతంలో ఎన్నడూ చూడని అరుదైన చెట్లను ఇక్కడి నీలగిరి తోటలో చూడవచ్చు.చాలా ఎత్తుగా,గుబురుగా పెరిగిన దట్టమైన నీలగిరి తోటలో విహరిస్తూ నీలగిరి తోటల అందాలతో ప్రయాణం ప్రత్యేకంగా అనిపిస్తుంది.
ముత్యాల మడువులో ట్రెక్కింగ్‌ మీ సాహసానికి,సహనానికి పరీక్ష పెడుతుంది.ఎగుడుదిగుడు ప్రయాణంతో మీలోని ఓపిక,సహనాన్ని పరీక్షకు పెడుతూ అక్కడక్కడా పెటిట్‌ జలపాతాలతో మిమ్మల్ని ఉత్తేజపరుస్తూ ముత్యాలమడువు ట్రెక్కింగ్‌ ప్రత్యేక జ్ఞాపకంగా నిలుస్తుంది.ఇక ముత్యాలమడువుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అశోక్‌చంద్ర కాంప్లెక్స్‌లో ముత్యాలమడువు ట్రెక్కింగ్‌,పర్యాటకానికి గుర్తుగా ఇంటికి తీసుకెళ్లడానికి ఎన్నో హస్తకళ,చేనేత,సాంప్రదాయా ఉత్పత్తులు,వస్తువులు లభిస్తాయి.అడవుల్లో లభించే జరీబుట్టి,స్వచ్ఛమైన తేనే తదితర అటవీఉత్పత్తులు సైతం ఇక్కడ లభిస్తాయి..

పెర్ల్‌వ్యాలీలో జలప్రవాహం..



 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos