హొసూరులో దారుణ హత్య

హొసూరులో దారుణ హత్య

హొసూరు : ఇక్కడి పారిశ్రామికవాడలోని బ్యాడరపల్లిలో మంగళవారం రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన కృష్ణప్ప (37) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పోలీసుల కథనం మేరకు కృష్ణప్పకు, అదే గ్రామానికి చెందిన అభిలాష్ కుటుంబీకులకు మధ్య పాత కక్షలు ఉన్నాయి. మూడేళ్ల క్రితం కృష్ణప్ప, అభిలాష్ కుటుంబీకులపై దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణప్ప బ్యాడరపల్లిలో  ఓ దుకాణం ముందు నిలుచుకుని ఉండగా అక్కడికి వచ్చిన అభిలాష్ కుటుంబీకులు అతనిపై కత్తితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన కృష్ణప్ప సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందడంతో సిప్‌కాట్‌ పోలీసులు అక్కడికి చేరుకుని శవాన్ని స్వాధీనపరచుకొని హొసూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. ఈ హత్యకు కారణం పాత కక్షలా లేక వేరే ఏమైనా ఉందా…అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos