మునావర్ షోకు అనుమతి నిరాకరణ

మునావర్ షోకు అనుమతి నిరాకరణ

న్యూఢిల్లీ : కమెడియన్ మునావర్ ఫారూకీ ఆదివారం మధ్యా హ్నం 2 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు ఇక్కడి కేదార్ నాథ్ సాహ్ని ఆడిటోరియం నిర్వహించాల్సిన ప్రదర్శనను పోలీ సులు నిషేధించారు. అది మతసామరస్యానికి విఘాతం కలిగి స్తుందనే కారణంతో ఢిల్లీ సెంట్రల్ డిస్ట్రిక్ట్ పోలీసులు అనుమతి నిరాకరించారు. గత వారం బెంగళూరులో నిర్వహించాల్సిన ప్రదర్శనకూ అక్కడి పోలీసులు అనుమతించ లేదు. ఆ మర్నాడే హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో మునావర్ ఫారూకీ షో విజయ వంతంగా జరిగింది. 1,000 మంది పోలీసులతో, పటిష్ఠ భద్రత నడుమ తెలంగాణ సర్కారు షో నిర్వహణకు సహకారం అందించింది. ఈ షోకు అనుమతి రద్దు చేయాలని తెలంగాణ బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేయడం తెలిసిందే. రాజాసింగ్ డిమాండ్ ను తెలంగాణ సర్కారు పట్టించు కోక పోవ డంతో, ఆయన వివా దాస్పద వీడియో విడుదల చేయడం, దీనిపై పోలీసులు అరెస్ట్ చేసారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos